ఇదేనా జీవితం ?
ఈ మాట అనుకోనివారు ఎవరూ ఉండరు
సాధించడం అంటే కొండలను పిండి చేయడమే కాదు , పిండితో రొట్టె చేసుకోవడం కూడా సాధించినట్లే .అలాంటి రొట్టెలు తిన్న వస్తాదుల వాస్తవ విషయాలు తెలుసుకోవడమే మన ఆలోచనల విజయం. మన ఆలోచనలే మనకు గొప్ప జీవితాన్ని ఇస్తాయి. కేవలం మన ఆలోచనలను మార్చుకోడానికి మనం చేసే చిన్న ప్రయత్నం ఇది.
గొప్ప వ్యక్తులు ఉండరు , వ్యక్తిత్త్వమే గొప్ప మనిషిని చేస్తుంది .మనం గొప్ప గొప్ప పనులు చేస్తేనే సాధించినట్లు కాదు. చిన్న చిన్నపనులే గొప్ప వ్యక్తులను చేస్తాయి. మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనం సాధించిన పెద్ద పెద్ద విజయాలుగా బావిద్దాం.మనం చేసిన చిన్న పనులే ఎదుటివారికి గొప్ప స్పూర్తిని ఇవ్వోచ్చు .
ఇదే నా జీవితం !
No comments:
Post a Comment